పార్టీ వీడనున్న నందమూరి హరికృష్ణ!

- January 29, 2016 , by Maagulf
పార్టీ  వీడనున్న నందమూరి హరికృష్ణ!

ఏపీ రాజకీయాల్లో ఓ పెను పరిణామం చోటు చేసుకోబోతోందా.. ఇన్నాళ్లూ టీడీపీలో కొనసాగుతున్న నందమూరి హరికృష్ణ ఇప్పుడు పార్టీ మారబోతున్నారా.. తన బావ చంద్రబాబు తీరుతో విసిగిపోయిన హరికృష్ణ ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపబోతున్నారా.. ఇప్పుటికే ఆయన వైసీపీ అధినేత జగన్ తో టచ్ ఉన్నారా.. ఇప్పుడీ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న నందమూరి హరికృష్ణ కొన్నేళ్లుగా పార్టీ తీరుపట్ల ఆగ్రహంగా ఉన్నారు. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీకి తన కుటుంబాన్ని దూరం పెట్టడం వంటి పరిణామాలతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అలాగే తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ను కాదని లోకేశ్ కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు జరిగిపోవడం ఆయనకు చిరాకు కలిగించాయి.కాకపోతే.. టీడీపీలో కొనసాగడం మినహా వేరే గత్యంతరం లేని ఆయన పార్టీలోనే ఉంటూ వస్తున్నారు. కానీ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. విడుదల సమయంలో జరిగిన పరిణామాలు ఆయన్ను మరింతగా హర్ట్ చేశాయట. నాన్నకుప్రేమతో సినిమాను లోకేశ్ వర్గీయులు కోస్తా, రాయలసీమల్లో అడ్డుకునేలా ప్రయత్నించడం ఆయనకు తీవ్ర ఆగ్రహం కలిగించిందట. ఇన్నాళ్లూ ఈ అవమానాలను భరిస్తూ వచ్చిన హరికృష్ణ ఇక పార్టీలో కొనసాగడం ఎంత మాత్రం కుదరదన్న నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే ఆయన కొన్నిరోజులుగా వైసీపీ అధినేత జగన్ తో రోజూ టచ్ లో ఉంటున్నారట. నాన్నకు ప్రేమతో సినిమాను రాయలసీమలో వైసీపీ అండతోనే ప్రదర్శించారట. ఈ వరుస పరిణామాల ఫలితంగా హరికృష్ణ ఏక్షణమైనా జగన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని వదంతులు వినిపిస్తున్నాయి. మరి అదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ ఏంచేస్తారన్నది ఆసక్తికరమే. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో..!?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com