సౌదీ మాస్క్‌లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి
- January 29, 2016
తూర్పు సౌదీ అరేబియాలోని ఓ మాస్క్‌లో శుక్రవారం ప్రార్ధనలు జరుగుతన్న సమయంలో ఓ ఆత్మాహుతి దాడి జరిగింది. తనతోపాటు తెచ్చుకున్న బాంబును పేల్చుకున్నాడో వ్యక్తి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యారు. అంతకు ముందు ఆ వ్యక్తి విచక్షణా రహితంగా ప్రార్ధనలు జరుపుతున్నవారిపై కాల్పులు జరిపాడు. అతన్నుంచి తప్పించుకునే ప్రయత్నం కొందరు చేయగా, మరికొందరు మసీదులో ఉన్నవారు దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగా, అడ్డగించిన దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు భద్రతా సిబ్బంది వారిని నిలువరించారని, వారిరువురూ కాల్పులు జరిపారనీ, తప్పించుకునే అవకాశం లేకపోవడంతో దుండగులు తమను తాము పేల్చేసుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







