అబుధాబి: ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాపై 50 శాతం తగ్గింపు
- May 21, 2020
అబుధాబి: వాహనదారులకు శుభవార్త..తమకు గల జరిమానాలు జూన్ 22 లోగా కట్టేస్తే
50 శాతం తగ్గింపు పొందవచ్చని అబుధాబి పోలీసు ప్రకటించారు.
ఎవరెవరికి ఎంతెంత తగ్గింపు?
2019 డిసెంబర్ 22 లోపు జరిగిన స్వల్ప ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాపై 50 శాతం తగ్గింపు పొందవచ్చని తద్వారా మూడు నెలల పాటు వాహనాన్ని జప్తు చేయటం లేదా బ్లాక్ పాయింట్లను నివారించవచ్చని అబుధాబి పోలీసులు తెలిపారు. 60 రోజుల్లో జరిమానాను క్లియర్ చేసిన వారికి 35 శాతం డిస్కౌంట్ మరియు 60 రోజుల కన్నా ఎక్కువ కాలం జరిమానాలు కట్టనివారికి 25 శాతం డిస్కౌంట్ కల్పించారు. కానీ, ఏదైనా ప్రమాదకరమైన నేరాలకు జారీ చేసిన జరిమానాలకు మాత్రం డిస్కౌంట్ వర్తించదు అని ఈ సందర్భంగా తెలిపారు.
జరిమానాలు ఎలా కట్టాలి?
ట్రాఫిక్ జరిమానా చెల్లింపు సేవ అబుధాబి పోలీసుల వెబ్సైట్ మరియు స్మార్ట్ఫోన్ల అప్లికేషన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా లభిస్తుంది. ఫర్స్ట్ అబుదాబి బ్యాంక్, అబుదాబి కమర్షియల్ బ్యాంక్, మష్రేక్ బ్యాంక్, అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ మరియు ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ కస్టమర్లు వడ్డీ లేకుండా ఒక సంవత్సరం పాటు జరిమానా వాయిదాలలో చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







