హెచ్చరిక: యూఏఈ నుంచి ఇండియాకి చార్టెడ్ విమానాల్లేవ్
- May 25, 2020
దుబాయ్:దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, ఇండియన్ నేషనల్స్ని ఉద్దేశించి ఓ హెచ్చరిక ప్రకటన చేసింది. ఇండియాకి చార్టెడ్ విమానాలంటూ కొందరు మోసగాళ్ళు టిక్కెట్లను అమ్మేస్తున్నారని, అలాంటివారి మాయలో పడొద్దని ప్రకటనలో హెచ్చరించింది కాన్సులేట్. కొందరు వ్యక్తులు, కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు యూఏఈలోని భారతీయులను సంప్రదించి, చార్టెడ్ విమానాల్లో భారతదేశానికి పంపిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ, అలాంటి అవకాశమేదీ ప్రస్తుతానికి లేదని కాన్సులేట్ తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాలకు సంబంధించి భారతీయులు అప్రమత్తంగా వుండాలనీ, ఏవైనా అనుమానాలుంటే భారత కాన్సులేట్‌ని సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు