విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులపై ఇండియా తాజా గైడ్‌లైన్స్
- May 25, 2020
మస్కట్: భారత హోం మంత్రిత్వ శాఖ, విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల విషయంలో తాజా స్టాండర్డ్ ఆపరేటింగ్ రపొసిడ్యూర్స్‌ని విడుదల చేసింది. ఇండియాకి తిరిగి వచ్చేయాలనుకున్నవారు, ఆయా దేశాల్లోని ఇండియన్ మిషన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ సూచన మేరకు అవసరమైన వివరాల్ని అందులో పొందుపర్చాల్సి వుంటుంది. స్వదేశానికి చేరుకున్నాక 14 రోజుల క్వారంటైన్‌కి ఒప్పుకుంటూ సంతకం చేయాల్సి వుంటుంది. ఏడు రోజుల సెల్ఫ్ పెయిడ్ ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్, ఏడు రోజుల హోం ఐసోలేషన్ ఇందులో వుంటుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏర్పాటు చేసే నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ విమినాలు అలాగే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ / డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ ఎఫైర్స్ ఏర్పాటు చేసే షిప్స్ ద్వారా స్వదేశానికి చేరుకోవాల్సి వుంటుంది. డిస్ట్రెస్‌తో వున్నవారు, లెయిడ్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్, షార్ట్ టెర్మ్ వీసా హోల్డర్స్, ప్రెగ్నెంట్ విమెన్, పెద్దవారు అలాగే మెడికల్ ఎమర్జన్సీ వున్నవారికి, విద్యార్థులకు తొలుత ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







