పూరీ ఆటోజానీలో రవితేజ..
- January 30, 2016
రవితేజ ఇటీవల బెంగాల్ టైగర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఈ చిత్రం మంచి సక్సెస్‌నే సాధించింది. ఇక తాజాగా వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఎవడో ఒకడు చిత్రాన్ని చేస్తోన్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులను సుధీర్ వర్మ, చక్రిలతో చేయనున్నారు. ఈ క్రమంలో పూరీతోను ఓ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.రవితేజ, పూరీ కాంబినేషన్‌లో 5 చిత్రాలు తెరకెక్కగా ఇందులో మూడు మంచి విజయం సాధించాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కగా తాజాగా చిరు కోసం తయారు చేసిన ఆటో జాని స్టోరీను రవితేజతో పూరి తెరకెక్కించనున్నట్టు సమాచారం.చిరు కోసం తయారు చేసిన కథలో కొన్ని మార్పులు చేసి రవితేజకు వినిపించగా, అందుకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూరీ ప్రస్తుతం రోగ్ అనే చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిస్తోండగా, ఈ సినిమా పూర్తైన తర్వాత ఆటోజానీ ను పట్టాలెక్కించనున్నట్టు టాక్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







