కోవిడ్19:దుబాయ్‌లో కొత్త సడలింపులు ఇవే..
- May 26, 2020
దుబాయ్:కరోనా వైరస్ నేపథ్యంలో కఠిన తరమైన లాక్డౌన్ నుంచి క్రమక్రమంగా సడలింపులు లభిస్తున్నాయి. తాజా సడలింపుల నేపథ్యంలో రోడ్లపై జనం కాస్త ఎక్కువగానే కన్పిస్తున్నారు. మే 27 నుంచి అమల్లోకి వచ్చిన సడలింపులు ఇలా వున్నాయి.రెసిడెంట్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మామూలుగానే తిరగవచ్చు.దుబాయ్ ఎయిర్ పోర్ట్, దేశంలోకి తిరిగి రావాలనుకునేవారి కోసం తెరిచి వుంటుంది. జిమ్ లు, ఫిట్నెస్ సెంటర్లు తెరిచి వుంటాయి. సోషల్ డిస్టెన్సింగ్, ఎప్పటికప్పుడు స్టెరిలైజేషన్ తప్పనిసరి.దుబాయ్ రిటెయిల్ స్టోర్స్, హోల్‌సేల్ ఔట్లెట్స్ రీ-ఓపెన్ అవుతున్నాయి. ఇన్టి క్లినిక్స్, పిల్లల హెల్త్ సెంటర్స్ తెరిచి వుంటాయి. రెండున్నర నెలలుగా ఆగిపోయిన సర్జరీలు తిరిగి కొనసాగుతాయి. సినిమాలు తిరిగి ప్రారంభమవుతాయి. సోషల్ డిస్టెన్సింగ్, స్టెరిలైజేషన్ తప్పదు. ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ మరియు రిక్రియేషనల్ వెన్యూస్ రీ-ఓపెన్ అవుతాయి. అన్ని గవర్నమెంట్ సెంటర్స్ (అమెర్, తషీల్ వంటివి) తెరవబడ్తాయి. ఆన్లైన్ ఆక్షన్స్ నిర్వహించలేని ఆక్షన్ హౌస్‌లు తెరుచుకోవచ్చు. కాగా, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి వుంటుంది. 2 మీటర్ల సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. దేశంలోకి వచ్చే ప్రయాణీకులంతా 14 రోజుల క్వారంటైన్‌కి ఒప్పుకోవాలి. 12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడినవారు, క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్నవారు షాపింగ్ సెంటర్స్, సినిమాలు, జిమ్ లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశించడానికి వీల్లేదు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







