మరిన్ని క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్న కువైట్
- May 26, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం, కరోనా వైరస్ నేపథ్యంలో కార్మికుల కోసం మరిన్ని క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తాండం స్పోర్ట్ క్లబ్‌లోని హాల్స్‌ని అప్పగించాల్సిందిగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్కి క్యాబినెట్ ఆదేశించడం జరిగింది. ఈ హాల్స్‌ని ఫర్వానియా హాస్పిటల్‌కి సపోర్ట్‌గా ఎమర్జన్సీ యూనిట్ ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన వివరాల్ని పభ్రుత్వ అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రెమ్ ఆన్లైన్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న కార్మికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీలకు క్యాబినెట్ సూచించినట్లు తెలిపారు తారెక్ అల్ మజ్రెమ్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, హోటల్స్‌ని క్వారెంటైన్ ఫెసిలిటీస్‌కి వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటుందని క్యాబినెట్ పేర్కొంది. లైవ్ స్టాక్ ఓనర్స్‌కి ఫోడర్‌ని అందించేందుకు కువైట్ ఫ్లోర్ మిల్స్ కంపెనీతో సమన్వయం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్‌కి క్యాబినెట్ సూచించింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







