తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు
- May 26, 2020
హైదరాబాద్:భారత దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణలో సానుకూల పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 120 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1284కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 650గా ఉంది.ఈరోజు కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 57కి చేరుకుంది.
మంగళవారం GHMC పరిధిలో 38 మందికి, 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన నలుగురితో పాటు రంగారెడ్డి జిల్లాలో ఏడుగురికి, మేడ్చల్‌లో ఆరుగురికి, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేటలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







