రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు సైన్ చేసిన హీరో కార్తిక్ రాజు

- May 26, 2020 , by Maagulf
రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు సైన్ చేసిన హీరో కార్తిక్ రాజు

పడేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం ఆయిన హీరో కార్తిక్ రాజు  కౌసల్య కృష్ణమూర్తి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు సూర్య అశ్విన్ వర్మ అనే నూతన దర్శకుడితో క్రికెట్ నేపథ్యంలో నడిచే ఒక రివేంజ్ డ్రామాలో కార్తిక్ నటించబోతున్నాడు. కథ బలం ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించే ట్విస్టులు ఉండబోతున్నాయి. 

సూర్య అశ్విన్ వర్మ సినిమాతో పాటు రజినీకాంత్ యన్న దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు కార్తిక్ రాజు. ఆకట్టుకునే డ్రామాగా ఈ సినిమా ఉండబోతొంది. రజనీకాంత్ యన్న గతంలో డైరెక్టర్ క్రిష్ దగ్గర వర్క్ చేశారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే సినిమా ఇది. 

కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో నా నటనకు మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు భీమినేని శ్రీనివాస్, నిర్మాత కెఎస్.రామారావు కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కథ బలం ఉన్న సినిమాలు చెయ్యడానికి నేను ఎప్పుడూ రెడీ, లాక్ డౌన్ తరువాత నా సినిమా చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి. భవిషత్తులో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కార్తిక్ రాజు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com