టీ.20 మ్యాచ్లో లారా జట్టుపై సెహ్వాగ్ సేన గెలుపు
- January 30, 2016
మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం జరిగిన టీ.20 మ్యాచ్లో బ్రియాన్ లారా సారథ్యంలోని లియో లయన్స్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని జెమిని అరేబియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లియో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా, జెమినీ అరేబియన్స్ 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెహ్వాగ్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ కుమార సంగక్కర 41 పరుగులు, బ్రాడ్ హాగ్ 65 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







