భారత్:గత 24 గంటల్లో 194 మంది మృతి
- May 28, 2020
కరోనా మహమ్మారి భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,566 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 194 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,531కు చేరింది. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 67,692 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మరో పక్క తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రికార్డు స్థాయిలో కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 39.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 68 మందికి వ్యాధి సోకింది. ఇక న్మిన్న కరోనా భారిన పడి ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 63మంది కరోనాతో మృతి చెందారు. ఇక కరోనా పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 2098కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1321మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 714 మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







