తెలంగాణ:కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు
- May 27, 2020
హైదరాబాద్:తెలంగాణలో బుధవారం 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2098 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 63కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణ నుంచి 39 మంది, వలసకార్మికులకు 19 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో 49 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. . ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.తాజాగా 37 మంది కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1321 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 714 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







