కువైట్: సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..అధికారుల హెచ్చరిక

- May 28, 2020 , by Maagulf
కువైట్: సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..అధికారుల హెచ్చరిక

సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రభుత్వ విధి విధానాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కువైట్ ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు అల్లి అసత్య పోస్టులు పెట్టే వారిని ఎట్టిపరిస్థితుల్లోని ఉపేక్షించబోమని సమాచార సాంకేతిక నియంత్రణ అధికారులు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై తమను తాము ప్రముఖ వ్యక్తులుగా చిత్రీకరించుకుంటూ అబద్ధపు పోస్టులతో ప్రజలు అయోమయానికి గురి చేస్తున్నారని కూడా తెలిపారు. అలాంటి వారిపై ఎప్పటికప్పుడు తమ పర్యవేక్షణ కొనసాగుతుందని..వారి ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ ను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించే వారు కూడా అలాంటి పోస్టుల పట్ల అప్రత్తంగా ఉండాలని, అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాకే షేర్ చేయాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com