కోవిడ్ 19: జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది విధులకు హజరు కావాలని ఆదేశాలు
- May 28, 2020
లాక్ డౌన్ తో అరకొరగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించనున్నాయి. జూన్ 14 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంతా విధులకు హజరు అయ్యేందుకు దుబాయ్ అనుమతించింది. దీంతో జూన్ 14 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సేవలు ప్రజలు అందుబాటులోకి రానున్నాయి. మే 31 నుంచి 50 శాతం సిబ్బంది విధులకు హజరవుతారని కూడా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే..కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని..అందుకే ప్రజలందరూ వీలైనంత వరకు డిజిటల్ సేవలనే వినియోగంచుకోవాలని కూడా సూచించారు. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ వేదికగా పలు రంగాల్లో సేవలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక మీదట కూడా డిజిటల్ సేవలను సమర్ధవంతంగా వినియోగంచుకొని స్మార్ట్ సిటీస్ లో దుబాయ్ ని ఆదర్శవంతంగా నిలపాలన్నారు. ఇదిలాఉంటే..ప్రభుత్వ సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగులు విధులకు హజరు కానుండటంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







