2021 వేసవి నాటికి పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న ఎయిర్ ట్రావెల్
- June 01, 2020
దుబాయ్:ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ దారుణంగా దెబ్బతిందనీ, అది మునుపటి స్థాయికి రావాలంటే కొంత సమయం పడుతుందనీ, 2021 సమ్మర్ నాటికి పరిస్థితి పూర్వ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ కనుగొనేవరకూ ఎయిర్ ట్రావెల్ రంగం పుంజుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. జీతాల్లో కోత సహా అనేక సమస్యల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ నేపథ్యంలో ఇదివరకటి స్థాయిలో ప్రజలు ఖర్చు చేసే అవకాశాలు ఇప్పట్లో వుండకపోవచ్చని టిమ్ క్లార్క్ అభిప్రాయం వెలిబుచ్చారు. కోవిడ్-19కి ముందున్న నెట్వర్క్ని అందుకోవడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ మూడు నాలుగేళ్ళ సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారాయన.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?