యూఏఈలో నిర్మాణ రంగ కార్మికులకు జూన్ 15 నుంచి మిడ్ బ్రేక్ అమలు
- June 03, 2020
యూఏఈ:వేసవిలో కార్మికుల ఆరోగ్య భద్రత కోసం మిడ్ డే బ్రేక్ ను ఈ నెల 15 నుంచి అమలులోకి రానుంది. నిబంధనల మేరకు మూడు నెలల పాటు మిడ్ డే బ్రేక్ అమలులో ఉంటుంది. అంటే సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నన విరామ సమాయాన్ని అన్ని నిర్మాణ రంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్ననం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు మూడు గంటలు బ్రేక్ టైంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే..అత్యవసర పనులకు మాత్రం మిడ్ డే బ్రేక్ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కానీ, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఖచ్చితంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పని ప్రదేశాల్లో చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. అలాగే కార్మికులు డీహైడ్రెషన్ (నిస్సత్తువగా)కు గురికాకుండా శక్తినిచ్చే పానియాలను కూడా ఇవ్వాలని మానవ వనరులు, ఎమిరైజేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు సూచించారు. అలాగే కార్మికులు సొమ్మసిల్లిపోయే అవకాశాలు ఉండటంతో ప్రాథమిక చికిత్సకు అవసరమైన కిట్ ను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇదిలాఉంటే మధ్యాహ్నన విరామ సమయంలో కార్మికులు సేద తీరేందుకు ఎండ తగలని ప్రాంతాన్ని ఆయా యాజమాన్యాలే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కార్మికుల పనివేళలు 8 గంటలకు మించితే ఎక్కువ వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లఘిస్తే Dh5,000 నుంచి Dh50,000 వరకు జరిమాన విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







