ఒమన్:కరోనా కట్టడికి నిబంధనలు పాటించాల్సిందే...క్లినింగ్ సర్వీస్ కార్మికులు సూచనలు

- June 03, 2020 , by Maagulf
ఒమన్:కరోనా కట్టడికి నిబంధనలు పాటించాల్సిందే...క్లినింగ్ సర్వీస్ కార్మికులు సూచనలు

మస్కట్:కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ఒమన్ ప్రభుత్వం..వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. క్లినింగ్ సర్వీస్ కార్మికుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశాలు ఉండటంతో..ఆ రంగంలోని కార్మికులు కూడా కోవిడ్ 19 కట్టడికి అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు క్లీనింగ్ సర్వీస్ కార్మికులను అందించే సంస్థలకు కూడా ఇదే విషయమై స్పష్టమైన సూచనలు చేసింది. క్లీనింగ్ సర్వీస్ లో ఉండే వ్యక్తలకు కరోనా సోకితే..వారి నుంచి ఇతరులకు వ్యాపించే తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఆ రంగంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఎవరికైనా కరోనాల లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని లేదంటే దగ్గర్లోని ఆస్పత్రులకు వెళ్లాలని కూడా మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు సూచించారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com