కువైట్:జ్లీబ్ షుయూఖ్ లో ఆహార పొట్లాలను అందజేసిన భారత రాయబారి
- June 04, 2020
కువైట్:కువైట్ లోని ప్రవాస భారతీయులకు సాయం అందజేసేందుకు ఏర్పాటైన ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్-ICSG తమ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఐసోలేషన్ ప్రాంతాల్లో ప్రవాస భారీయులకు అవసరమైన సామాగ్రి, ఆహారాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా జ్లీబ్ షుయూఖ్ లో ICSG ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమంలో భారత రాయబారి జీవ సాగర్ పాల్గొన్నారు. పలువరికి ఫుడ్ బాస్కెట్లను అందజేశారు. కువైట్ లోని ఎన్ఆర్ఐలతో పాటు వివిధ అసోసియేషన్ ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ICSG నిర్వహించింది. ఈ సందర్భంగా ICSG సమావేశ నిర్వాహకులు రాజ్ పాల్ త్యాగి మాట్లాడుతూ..కువైట్ లోని భారతీయులకు సహాయ సహాకారాలు అందించటంలో విశేషంగా కృషి చేస్తున్న భారత రాయబార కార్యాయల సేవలను కొనియాడారు. అలాగే ICSGకి వెన్నంటే ఉంటూ వ్యక్తిగత శ్రద్ధతో సహారం అందిస్తున్నారని, నిబద్ధత గల వాలంటీర్లను అందించటంలో ఎంతగానో చొరవ తీసుకున్నారని జీవ్ సాగర్
సేవలను ప్రశంసించారు.
భారత రాయబారి జీవ సాగర్ మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ICSG ఎంతో నిబద్ధతో కువైట్ లోని భారత సమాజానికి తోడుగా నిలబడుతోందని అన్నారు. అలాగే ఈ కష్టకాలంలోనూ భారత సమాజ సంరక్షణకు అత్యంత శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుంటున్నారని కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ 19 నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న ఎన్ఆర్ఐలకు కనీస సాయం అందించేందుకు ఇండియన్ ఎంబసీ 14 మందితో కూడిన ICSG గ్రూప్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాము ఆశించిన స్థాయికి మించి ICSG తమ సేవలను కొనసాగిస్తోందని గత నెల రోజులుగా 6000 ఫుడ్ పార్శిల్స్ అందించిందన్నారు. అలాగే 1,80,000 మంది ఆహారాన్ని సమకూర్చిందని, ఈ సేవా కార్యాక్రమంలో దాదాపు 40 ఇండియన్ సొసైటీలు కూడా పాలుపంచుకున్నాయని జీవసాగర్ వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







