ప్రజా సమూహం,ఫేస్ మాస్కులపై ఆంక్షలు ఇంకా అమలులోనే ఉన్నాయి : రాయల్ ఒమన్ పోలీసు
- June 04, 2020
ఒమన్ లో ప్రజా సమూహాలు, వినోద కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు ఇంకా అమలులోనే ఉన్నాయని గుర్తుచేశారు రాయల్ ఒమన్ పోలీసులు. ప్రజల సాధారణ జనజీవనాన్ని పునరుద్ధరించటంలో భాగంగా ఒమన్ ప్రభుత్వం పలు రంగాలకు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..అంతమాత్రన పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు కాదని కూడా స్పష్టత ఇస్తున్నారు. ప్రజలు ఒకే చోట గుమికూడటంపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అలాగే ఫేస్ మాస్కులను కూడా ఖచ్చితంగా ధరించాలన్నారు. ఒకే చోట ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమికూడితే అది నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని, అలాగే ఐదుగురు అంతకు మించి తక్కువ సంఖ్యలో వ్యక్తులు ఒకే దగ్గర ఉన్నా భౌతిక దూరం పాటించాలని, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే OMR20 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు వినోద కార్యక్రమాలు లేదా అంత్యక్రియల్లో పాల్గొన వారు కూడా పరిమత సంఖ్యలోనే ఉండాలని కూడా పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే OMR 1500 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని, అదే తప్పును మళ్లీ చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు