రియాద్:అక్రమ మార్గాల్లో విదేశాలకు కరెన్సీ తరలిస్తున్న సౌదీ గ్యాంగ్ అరెస్ట్
- June 04, 2020
రియాద్:మనీ లాండరింగ్ తరహాలో వివిధ దేశాలకు అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్న సౌదీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పది మంది సభ్యులు గల ఈ గ్యాంగ్ దాదాపు Sr100 మిలియన్ల డబ్బును అక్రమంగా విదేశాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. చట్టవ్యతిరేక విధానాల్లో సౌదీ నుంచి ఇతర దేశాలకు డబ్బు తరలిస్తున్నట్లు తమకు అందిన సమాచారంతో సౌదీ గ్యాంగ్ కార్యకలాపాలపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్లు రియాద్ పోలీస్ అధికార ప్రతినిధి కల్నల్ షకర్ అల్ తువైర్జి వెల్లడించారు. ఈ గ్యాంగ్ పెద్ద మొత్తంలో విదేశీ ఖాతాలోకి నగదు బదిలీ చేస్తోందని తమ ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారణ అయినట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు..10 మంది సభ్యుల గ్యాంగ్ తమ విచారణలో నేరాన్ని అంగీకరించారని, దాదాపు 10 బోగస్ వ్యాపార సంస్థల ద్వారా నగదు బదిలీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ 10 వ్యాపార సంస్థలు వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు పొందలేదని కూడా గుర్తించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు