యూ.ఏ.ఈ:లిమిటెడ్‌ విమానాలతో ఎయిర్‌ పోర్టుల పునఃప్రారంభం

- June 04, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:లిమిటెడ్‌ విమానాలతో ఎయిర్‌ పోర్టుల పునఃప్రారంభం

యూ.ఏ.ఈ:లిమిటెడ్‌ విమానాలతో విమానాశ్రయాల్ని నిర్వహించేందుకు యూఏఈ అనుమతులు జారీ చేసింది. ఎతిహాద్‌, ఎమిరేట్స్‌, ఫ్లై దుబాయ్‌, ఎయిర్‌ అరేబియా సంస్థలకు ఈ అనుమతులు జారీ అయ్యాయి. అబుధాబి, దుబాయ్‌ మరియు షార్జా విమానాశ్రయాలకు ఈ సంస్థలు సేవలు అందిస్తాయని నేషనల్‌ క్రౌసిస్‌ అండ్‌ ఎమర్జన్సీ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికార ప్రతినిది¸ డాక్టర్‌ సైఫ్‌ అల్‌ దహెరి చెప్పారు. దుబాయ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌, ఎమిరేట్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్, ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కేవలం ట్రాన్సిట్‌ మరియు ప్రత్యేక విమానాలు మాత్రమే నడుస్తున్నాయి ఆయా విమానాశ్రయాల నుంచి. కరోనా వైరస్‌ నేపథ్యంలో, అన్ని విభాగాలూ అప్రమత్తంగా వున్నాయనీ, సంబంధిత ప్రోటోకాల్స్‌కి అనుగుణంగా అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అధికార యంత్రాంగం పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com