ఇమామ్ కు కరోనా లక్షణాలు.. మసీదు తాత్కాలిక మూసివేత..
- June 04, 2020
సౌదీ: సౌదీ అరేబియా నగరమైన దమ్మామ్లోని మసీదుకు చెందిన ఇమామ్ కు కరోనా సోకిందని అనుమానం కలుగగా ఆ మసీదును తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు సౌదీ మీడియా గురువారం నివేదించింది. సౌదీ లో మసీదులు తిరిగి తెరిచిన కొద్ది రోజుల తరువాతే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రాంతంలోని మంత్రిత్వ శాఖకు మరియు భక్తులకు ఇమామ్ స్వయంగా వాట్సాప్ ద్వారా ఈ విషయం తెలియజేయగా వెంటనే అప్రమత్తమైన ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మసీదును మూసివేసింది. తాత్కాలిక మూసివేత సమయంలో మసీదు పూర్తిగా క్రిమిరహితం చేయబడుతుందని తెలిపిన అధికారులు.
కాగా, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి రావాలనే ప్రణాళికకు అనుగుణంగా సౌదీ లో మక్కా మినహా 900,000 మసీదులను ఆదివారం తిరిగి తెరిచిన తరువాత ఇదే మొదటి షట్డౌన్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!