ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు
- June 04, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.నిన్న ఒక్క రోజు కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 19 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చిన వారు ఉన్నారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,377 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 2,273 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 71కు చేరగా, ప్రస్తుతం 1,033 మంది వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







