ఇండియా,పాకిస్తాన్‌ సహా మరో 9 డెస్టినేషన్స్‌కి ఫ్లై దుబాయ్‌ స్పెషల్‌ ఫ్లైట్స్‌

- June 05, 2020 , by Maagulf
ఇండియా,పాకిస్తాన్‌ సహా మరో 9 డెస్టినేషన్స్‌కి ఫ్లై దుబాయ్‌ స్పెషల్‌ ఫ్లైట్స్‌

యూఏఈ తమ ఎయిర్‌పోర్టుల్ని రీ-ఓపెన్‌ చేస్తుండడం అలాగే, ట్రావెల్‌ మూమెంట్స్‌పైన రిస్ట్రిక్షన్స్‌ని తగ్గిస్తుండడం నేపథ్యంలో ఫ్లై దుబాయ్‌, రీపాట్రియేషన్‌ విమానాల్ని ఎంపిక చేసిన డెస్టినేషన్స్‌కి మరింత ఎక్కువగా నడిపేందుకు సిద్ధమయ్యింది. ఇండియా, పాకిస్తాన్‌ సహా మరికొన్ని దేశాలకు ఈ విమానాల్ని నడపనుంది. దుబాయ్‌కి చెందిన లో కాస్ట్‌ క్యారియర్‌, ప్రత్యేకంగా రీపాట్రియేషన్‌ విమానాల్ని 11 దేశాల్లోని వివిధ నగరాలకు నడపనున్నట్లు వెల్లడించింది. యూఏఈలో చిక్కుకుపోయినవారిని ఆయా దేశాలకు పంపేందుకు ఫ్లై దుబాయ్‌ ఈ చర్యలు చేపట్టింది. యూఏఈ రెసిడెంట్స్‌ అలాగే కరోనా కారణంగా చిక్కుకుపోయిన ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, బల్గేరియా, ఫిన్లాండ్‌, జార్జియా, కిర్గిస్తాన్‌, రొమేనియా, సెర్బియా మరియు ఉక్రెయిన్‌కి చెందినవారు తమ దేశాలకు వెళ్ళేందుకు బుధవారం నుంచి రీపాట్రియేషన్‌ విమానాల్లో టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఫ్లై దుబాయ్‌ పేర్కొంది. ఈ విమానాలు కేవలం రీపాట్రియేషన్‌ కోసమేనని సంస్థ పునరుద్ఘాటించింది. వన్‌ వే ఎకానమీ క్లాస్‌ ఫేర్స్‌ ఈ విమానాల్లో వర్తిస్తాయి. ఇప్పటికే ఫ్లై దుబాయ్‌ పాకిస్తాన్‌కి విమానాలు నడిపింది రీపాట్రియేషన్‌ కోసం. 20 కిలోల చెక్‌డ్‌ బ్యాగేజీని అనుమతిస్తారు. ల్యాప్‌టాప్‌, హ్యాండ్‌బ్యాగ్‌, బ్రీఫ్‌ కేస్‌ లేదా బేబీ ఐటమ్స్ ని  మాత్రమే క్యాబిన్‌లోకి అనుమతించనున్నట్లు ఫ్లై దుబాయ్‌ వెల్లడించింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ 2 నుంచి ఈ విమానాలు ఆపరేట్‌ అవుతాయి. ప్రభుత్వ అనుమతితోనే అన్ని విమానాలూ నడుస్తాయి. విమానంలో మీల్స్‌ని సంస్థ అందించదు. స్నాక్‌ బాక్స్‌ మాత్రం అందిస్తారు. ఫ్లైట్‌ మాడిఫికేషన్‌ లేదా క్యాన్సిలేషన్‌కి సంబంధించి పెనాల్టీ అప్లయ్‌ అవదు. ఫ్లై దుబాయ్‌ వోచర్‌ రూపంలోనే రిఫండ్స్‌ ప్రాసెస్‌ అవుతాయి. ఒకవేళ టిక్కెట్‌ బుక్‌ చేసుకుని, విమానంలో వెళ్ళకపోతే మాత్రం అది రిఫండబుల్‌ కాదు, మార్చడానికి వీల్లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com