ప్చ్..కరోనా సంఖ్యల్లో టాప్5 కు చేరిన భారత్
- June 07, 2020
భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 9971 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In India) నమోదయ్యాయి. ఒక్కరోజు కరోనా కేసులలో దేశంలో ఇదే అత్యధికం. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 287 మంది మరణించడం విచారకరం. తాజా కేసులతో కలిపి భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,46,628కు చేరింది.
తాజాగా నమోదైన కోవిడ్19 (COVID-19) పాజిటివ్ కేసులతో స్పెయిన్ దేశాన్ని భారత్ వెనక్కి నెట్టింది. స్పెయిన్‌లో 2.41లక్షల కేసులతో ఆరో స్థానానికి పడిపోగా, ప్రతిరోజూ అత్యధికంగా కరోనా కేసులు నమోదు చేస్తున్న భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే మాత్రమే భారత్ కంటే అధికంగా కరోనా కేసులు నమోదు చేసిన దేశాల జాబితాలో ఉన్నాయి. కరోనా మరణాలలో మాత్రం భారత్ 12వ స్థానంలో ఉంది. ఈ మరణాలు ఇలాగే కొనసాగితే జూన్ చివరికల్లా టాప్5 చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ కేసులకుగానూ 1,19,293 మంది ప్రాణాంతక వైరస్ కోవిడ్19 బారి నుంచి కోలుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటివరకూ దేశంలో 6,929 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం భారత్‌లో 1,20,406 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







