హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో మృతి
- June 07, 2020
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ రోజు మథ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. సడెన్‌గా గుండెపోటు రావడంతో బంధువులు అతనిని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని వయసు 39 సంవత్సరాలు. చిరంజీవి సర్జా ఇప్పటివరకూ 19 సినిమాల్లో నటించారు. 1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా తొలి నాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. అతని సోదరుడు నటుడు ధ్రువ సర్జా కన్నడనాట హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి సర్జాకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. నటి మేఘనా రాజ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు