ఒక్క కరోనా కేసూ లేదు.. సంతోషంతో డ్యాన్స్ చేసిన ప్రధాని
- June 08, 2020
50 లక్షల జనాభా.. అయినా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కరోనాని సమర్ధవంతంగా ఎదుర్కొంది. గత 17 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోవడంతో లాక్డౌన్ ఎత్తివేసింది న్యూజిలాండ్ దేశం. ప్రధాని జసిండా అర్డర్న్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్ ను కరోనా ఫ్రీ దేశంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. హ్యాపీగా ఎంతమందైనా కలిసి తిరిగేయండి.. భౌతిక దూరాన్ని అస్సలు పాటించక్కర్లేదని చెప్పారు. అయితే దేశ సరిహద్దుల వద్ద మాత్రం ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఆమె అన్నారు.
కాగా, ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు 1154, మరణించిన వారి సంఖ్య 22. కేసులు లేవని తెలిసిన వెంటనే ప్రధాని తన ఛాంబర్ లో డ్యాన్స్ చేశారని మీడియా పేర్కొంది. కరోనాని విజయవంతంగా ఎదుర్కున్న న్యూజీల్యాండ్ లో ఇక నుంచి నైట్ క్లబ్ లు, థియేటర్లు తెరుచుకుంటాయి. క్రీడా ప్రాంగణాలు కూడా పరిమితులకు లోబడి తెరుచుకుంటాయి. విస్తృత స్థాయిలో, ప్రధాని ఆంక్షలను సడలించడం న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ఆర్థిక పురోగతి వైపు దృష్టి సారిస్తామని ప్రధాని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు