మస్కట్:కరోనా ట్రీట్మెంట్ కోసం బ్లడ్ ప్లాస్మా ఇచ్చిన మున్సిపాలిటి ఉద్యోగులు

- June 09, 2020 , by Maagulf
మస్కట్:కరోనా ట్రీట్మెంట్ కోసం బ్లడ్ ప్లాస్మా ఇచ్చిన మున్సిపాలిటి ఉద్యోగులు

మస్కట్ మున్సిపాలిటిలోని కొందరు ఉద్యోగులు కోవిడ్ 19 నుంచి పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నారు. బ్లడ్ ప్లాస్మా ఇచ్చేందుకు 33 మంది ఉద్యోగులు ముందుకు వచ్చారు. కోవిడ్ 19ని అరికట్టేందుకు వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తుల బ్లడ్ ప్లాస్మా..ట్రీట్మెంట్లో ఎంతో దోహదం చేస్తుందనేది తెలిసిన విషయమే. ఆ దిశగా పలు దేశాలు కోవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కరోనా పేషెంట్ శరీరంలోకి పంపించి కరోనాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒమన్ లోని బ్లడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. DBBS పిలుపుతో మస్కట్ మున్సిపాలిటికి చెందిన 33 మంది ఉద్యోగులు ప్లాస్మా దానం చేశారు. అయితే..తమకు O+, A+, B+, AB+ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్లాస్మా దాతలు కావాలని, ఆయా గ్రూప్ లు ఉన్న వారు ప్లాస్మా దానం చేయాలనుకుంటే 94555648 నెంబర్ కు వాట్సాప్ చేయాలని అధికారులు కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com