RO300 మిలియన్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు..ఆదేశాలు జారీ చేసిన ఒమన్ సుల్తాన్
- June 10, 2020
మస్కట్: ఒమన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమలు బాధ్యతను తమ సంస్థకు అప్పగించినట్లు ఒమనీ ఇన్వెస్టిమెంట్ కార్పోరేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒమన్ లో 300 మిలియన్ల ఒమనీ రియల్స్ తో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల ప్రాజెక్టును తమ సంస్థకు అప్పగిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ దేశాలను జారీ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో రాయల్ డిక్రీ ద్వారా ఈ ప్రైవేట్ సంస్థ ప్రారంభమైన విషయం తెలిసింది. ఈ సంస్థ నేరుగా సుల్తాన్ కు లోబడి ఉంటుంది. సుల్తాన్ కు చెందిన భూభాగంలో నివసించే ప్రజలు పట్ల సుల్తాన్ తెలివైన నాయకత్వంలో పురోగతి సాధించేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ కంపెనీ తన ప్రకటనలో అకాంక్షించింది. ఈ నెల మొదటి వారంలో ఏర్పడిన ఈ కంపెనీ 300 మిలియన్ల ఒమన్ రియాల్స్ తో ఖజీన్ ఎకనామిక్ సిటీ అభివృద్ధి చేయనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!