వందే భారత్ మిషన్ 3: యూఏఈ నుంచి ఇండియాకు 45 ఫ్లైట్లు
- June 10, 2020
యూఏఈ:లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన ప్రవాసీయులను భారత్ తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ మూడో దశ షెడ్యూల్ ప్రకటించారు అధికారులు. యూఏఈ నుంచి భారత్ కు మొత్తం 45 విమాన సర్వీసులను నడపనున్నారు. అయితే..ఇందులో 44 సర్వీసులు కేరళకు కేటాయించారు. మరో సర్వీసును మాత్రం ఒడిషాకు నడపనున్నారు. మొత్తం విమాన సర్వీసులను కేరళకే కేటాయించటం పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దీంతో వాళ్లంతా రెండో దశ వందే భారత్ మిషన్ లోని విమాన సర్వీసులపైనే ఆశలు పెంచుకున్నారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా షెడ్యూల్ చేసిన విమాన సర్వీసుల్లో తమకు సీట్లు కన్ఫమ్ కావాలని ఆశిస్తూ ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ రెండో దశలో భాగంగా ఈ నెల 9 నుంచి 19 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. సెకండ్ ఫేజ్ లో మొత్తం 25 విమాన సర్వీసులను ప్రకటించగా అందులో 8 కేరళకు నడపనున్న విషయం తెలిసింది. అయితే..ఆ తర్వాత షెడ్యూల్ ను సవరించి మరో 5 విమానాలను ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, హైదరాబాద్, లక్నో నగరాలకు ఈ నెల 21, 23న నడపనున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!