RO300 మిలియన్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు..ఆదేశాలు జారీ చేసిన ఒమన్ సుల్తాన్

- June 10, 2020 , by Maagulf
RO300 మిలియన్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు..ఆదేశాలు జారీ చేసిన ఒమన్ సుల్తాన్

మస్కట్: ఒమన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమలు బాధ్యతను తమ సంస్థకు అప్పగించినట్లు ఒమనీ ఇన్వెస్టిమెంట్ కార్పోరేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒమన్ లో 300 మిలియన్ల ఒమనీ రియల్స్ తో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల ప్రాజెక్టును తమ సంస్థకు అప్పగిస్తూ సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ దేశాలను జారీ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నెల మొదటి వారంలో రాయల్ డిక్రీ ద్వారా ఈ ప్రైవేట్ సంస్థ ప్రారంభమైన విషయం తెలిసింది. ఈ సంస్థ నేరుగా సుల్తాన్ కు లోబడి ఉంటుంది. సుల్తాన్ కు చెందిన భూభాగంలో నివసించే ప్రజలు పట్ల సుల్తాన్ తెలివైన నాయకత్వంలో పురోగతి సాధించేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ కంపెనీ తన ప్రకటనలో అకాంక్షించింది. ఈ నెల మొదటి వారంలో ఏర్పడిన ఈ కంపెనీ 300 మిలియన్ల ఒమన్ రియాల్స్ తో ఖజీన్ ఎకనామిక్ సిటీ అభివృద్ధి చేయనున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com