యూఏఈకి 2 లక్షల మంది ప్రవాసీయులు తిరిగి వచ్చేలా టార్గెట్

- June 12, 2020 , by Maagulf
యూఏఈకి 2 లక్షల మంది ప్రవాసీయులు తిరిగి వచ్చేలా టార్గెట్

యూఏఈ:సరైనా వీసా కలిగిన ప్రవాసీయులను తిరిగి తమ దేశానికి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. వివిధ దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయుల్లో దాదాపు 2 లక్షల మందిని దేశంలో అనుమతించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సమన్వయంతో కార్యచరణ ప్రారంభించాయి. ఇప్పటికే తొలి దశలో భాగంగా దాదాపు 31 వేల మంది వీసా కలిగిన ప్రవాసీయులను దేశంలోకి అనుమతించింది యూఏఈ. ఇక ఈ సారి కుటుంబ సభ్యులను కూడా తిరిగి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వనుంది. అయితే..వివిధ దేశాల్లో ఉండిపోయిన యూఏఈ వీసాదారులు తిరిగి యూఏఈకి ప్రయాణం వాలంటే..ముందుగా http://smartservices.ica.gov.ae వెబ్ సైట్ లో తమ విరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వివరాలను ప్రధాన్యత క్రమంలో పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారులు ఆమోదం పొందిన దరఖాస్తు దారులు ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే యూఏఈ తిరుగుప్రయాణం అయ్యే ప్రవాసీయులకు ఫ్లైట్ దిగగానే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే 14 క్వారంటైన్ లో గానీ, హోం క్వారంటైన్ లో గానీ ఉండాల్సి ఉంటుందని విదేశీవ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అలాగే యూఏఈ చేరుకునే ప్రయాణికులు అంతా ప్రభుత్వం సూచించిన ట్రాకింగ్ యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com