యూఏఈకి 2 లక్షల మంది ప్రవాసీయులు తిరిగి వచ్చేలా టార్గెట్
- June 12, 2020
యూఏఈ:సరైనా వీసా కలిగిన ప్రవాసీయులను తిరిగి తమ దేశానికి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. వివిధ దేశాల్లో ఉండిపోయిన ప్రవాసీయుల్లో దాదాపు 2 లక్షల మందిని దేశంలో అనుమతించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సమన్వయంతో కార్యచరణ ప్రారంభించాయి. ఇప్పటికే తొలి దశలో భాగంగా దాదాపు 31 వేల మంది వీసా కలిగిన ప్రవాసీయులను దేశంలోకి అనుమతించింది యూఏఈ. ఇక ఈ సారి కుటుంబ సభ్యులను కూడా తిరిగి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వనుంది. అయితే..వివిధ దేశాల్లో ఉండిపోయిన యూఏఈ వీసాదారులు తిరిగి యూఏఈకి ప్రయాణం వాలంటే..ముందుగా http://smartservices.ica.gov.ae వెబ్ సైట్ లో తమ విరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వివరాలను ప్రధాన్యత క్రమంలో పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారులు ఆమోదం పొందిన దరఖాస్తు దారులు ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇదిలాఉంటే యూఏఈ తిరుగుప్రయాణం అయ్యే ప్రవాసీయులకు ఫ్లైట్ దిగగానే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే 14 క్వారంటైన్ లో గానీ, హోం క్వారంటైన్ లో గానీ ఉండాల్సి ఉంటుందని విదేశీవ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అలాగే యూఏఈ చేరుకునే ప్రయాణికులు అంతా ప్రభుత్వం సూచించిన ట్రాకింగ్ యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







