సముద్రంలోకి దూసుకెళ్లిన కారు..రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
- June 14, 2020
దుబాయ్: అల్ మమ్జార్ క్రీక్‌లో ప్రమాదవశాత్తు సముద్రంలోకి దూసుకెళ్లిన కారును దుబాయ్ పోలీసుల రెస్క్యూ టీమ్ బయటకు తీసింది.
దుబాయ్ పోలీసుల మారిటైమ్ రెస్క్యూ డివిజన్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ అలీ అబ్దుల్లా అల్ ఖాసిబ్ అల్ నక్బీ కధనం ప్రకారం, కారు నడుపుతున్న 41 ఏళ్ల అరబ్ మహిళ బీచ్ దగ్గర పార్కింగ్ స్థలంలో ఉండగా తన ఫోన్ ద్వారా చేదు వార్తను విన్నవెంటనే కంగారులో పొరపాటుగా యాక్సిలరేటర్ నొక్కటం జరిగింది. ఆ కంగారులో ఆమె హ్యాండ్ బ్రేక్ ఉపయోగించడం మర్చిపోయింది. దాంతో కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. తేరుకున్న ఆమె వెంటనే నీటిలో పడిపోయే ముందు కారు నుండి దిగిపోవటంతో ఎటువంటి గాయాలు పాలవ్వకుండా సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురించి ఆమె దుబాయ్ పోలీసులకు నివేదించగా, సముద్రం లోపలకు 30 మీటర్లు వెళ్ళిన కారును సహాయక బృందాలు ఒడ్డుకు చేర్చాయి.
అల్ నక్బీ వాహనదారులందరినీ అప్రమత్తంగా ఉండాలని, వారి స్వంత భద్రత కోసం మరియు ఇతరుల భద్రత కోసం డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!