ట్రంప్ ఆరోగ్యంపై సర్వత్రా చర్చ

- June 14, 2020 , by Maagulf
ట్రంప్ ఆరోగ్యంపై సర్వత్రా చర్చ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సరికొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఎస్ సైనిక అకాడమీలో నిన్న (శనివారం) జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో మంచి నీటి గ్లాసును అందుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. గ్లాసును పైకెత్తి తాగేందుకు ఎడమ చేతిని సాయంగా చేసుకున్నారు. అంతేకాదు, ఇటీవల ఆర్మీ కాలేజ్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రసంగించి మెట్లు దిగి వస్తున్న ట్రంప్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. రాష్ట్రాల పర్యటన సందర్భంగా ట్రంప్ కొంత అలసటకు గురికావడం వల్లే కొంత ఇబ్బందికి గురవుతున్నారని కొందరు చెబుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం అదేం కాదని, ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పడానికి ఇవి సంకేతాలని అంటున్నారు. అంతేకాదు, ట్రంప్ ఆరోగ్యంపై ఈ ఏడాది వార్షిక నివేదిక వెలువడకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కాగా, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బెండీ లీ మాత్రం ట్రంప్‌కు బ్రెయిన్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేయడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com