అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకు కుదింపు – జగన్ నిర్ణయం
- June 15, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిప్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వర్షాకాలంలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగించే విధంగా ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఈ రెండు రోజుల సమావేశాల్లో కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం, కొన్ని కీలక బిల్లుల్ని పాస్ చేయడం మాత్రమే జరుగనుంది.
సుదీర్ఘ చర్చలకు ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 16 నుంచి 20 తేదీలలో రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు జరనున్నట్టు సమాచారం. మొదటి రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగం, అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా అదే రోజు ప్రవేశపెట్టడం.. బడ్జెట్ కు ఆమోదం పొందిన మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కోవిద్-29 దృష్ట్యా సమావేశాలకు హాజరు కాబోయే నేతలందరికీ రేపటి నుండి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు. సభ్యుల వ్యక్తిగత సిబ్బంది, విజిటర్లకు కూడా ఈసారి అసెంబ్లీలోకి ప్రవేశం కల్పించడం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







