ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే కఠిన చర్యలు:సైబర్ పోలీసు
- June 15, 2020
ముంబై:అసలే బాధలో ఉన్న అభిమానులకు ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయొద్దని మహారాష్ట్ర సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి ఫోటోలను షేర్ చేయడం చట్టరీత్యా నేరమని ఒకవేళ ఇప్పటికే షేర్ చేసి ఉంటే డిలీట్ చేయమని కోరుతున్నారు. ఈ మేరకు సుశాంత్ అభిమానులు సైబర్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు.
వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. డెబ్ బాడీ ఫోటోలను చూసి తట్టుకోలేకపోతున్నామని.. దయచేసి అలాంటివి షేర్ చేయనీయకుండా చూడండి అని అభిమానులు పోలీసులను కోరారు. మా అభిమాన హీరో నవ్వును మాత్రమే చూడాలనుకుంటున్నామని తెలిపారు. సుశాంత్ మరణంతో బాలీవుడ్ కన్నీటి సంధ్రమైంది. ఓ మంచి నటుడిని కోల్పోయామని ఆయన నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







