ఇండియా చైనా ఘర్షణ: భారత్ దే తప్పంటున్న పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి

- June 17, 2020 , by Maagulf
ఇండియా చైనా ఘర్షణ: భారత్ దే తప్పంటున్న పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి

ఇండియా చైనా దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి అంటే మొదటగా సంతోషపడే దేశం పాకిస్తాన్.  ఎందుకంటే, ఇండియాకు పాక్ శత్రుదేశం.  చైనాకి ఆప్తమిత్రదేశం పాక్.  ఇండియా, పాక్ దేశాల సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఎప్పుడూ చూడలేదు.  నిత్యం ఘర్షణలు, ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే, చైనాతో ఇండియాకు బోర్డర్ వివాదం ఉన్నప్పటికీ, 1962 యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య ఎప్పుడూ కూడా పెద్దగా గొడవలు జరగలేదు.  

ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన బాహాబాహీ వలన 20 మంది ఇండియన్ ఆర్మీ, 43 మంది చైనా ఆర్మీ మరణించారు.  దీనిపై పాక్ విదేశాంగశాఖా మంత్రి స్పందించారు.  ఇండియన్ ఆర్మీనే మొదట కవ్వింపు చర్యలకు పాల్పడిందని, తప్పనిసరి పరిస్థితుల్లో చైనా ఆర్మీ కూడా ఇలా దాడి చేయాల్సి వచ్చిందని అన్నారు.  ఇండియా సరిహద్దు దేశాలతో సవ్యంగా ఉండటం లేదని అన్నారు.   చైనా దేశం, చైనా ఆర్మీ చాలా మంచివారు అన్నట్టుగా మాట్లాడాడు ఖురేషి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com