ప్రపంచపు అతిపెద్ద కరోనా సెంటర్..అక్కడ నో శానిటైజ్! ఓన్లీ రీసైకిల్!!
- June 17, 2020
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగిపోతున్నాయి. ఎన్ని కరోనా సెంటర్లు పెట్టి వైద్యం అందిస్తున్నా కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా చికిత్సా కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ కేంద్రం 10వేల పడకలతో ఉంటుంది. దీని విస్తీర్ణయం దాదాపు 22 ఫుట్ బాల్ మైదానాలంత ఉంటుంది.
దక్షిణ ఢిల్లీలోని రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ ను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రంగా దాదాపు 10 వేల బెడ్లతో మార్చనుంది ప్రభుత్వం. ఢిల్లీ-హర్యాలకు సరిహద్దులో నెలకొల్పే ఈ కేంద్రంలో ఒక్కో ఎన్ క్లోజరు 1700ల అడుగుల పొడవు..700 అడుగుల వెడల్పు ఉంటుదని రాథా సోమి సత్సంగ్ బియాస్ కార్యదర్శి వికాస్ సేథి తెలిపారు. ఇక్కడ నిత్యమూ శానిజైట్ చేయాల్సిన పనికూడా ఉండకపోవటం విశేషం. అటువంటి బెడ్లను ఏర్పాటు చేయనున్నారు.జూన్ నెల చివరికల్లా ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మెటల్ డేరాలతో ఏర్పాటు చేసే ఈ కేంద్రంలో లైట్లు..ఫ్యాన్లు..వాతావరణ పరిస్థితులకు అనుగుణం ఉపయోగించుకునేందుకు కూలర్లు ఉంటాయని..పేషెంట్లకు వైద్యసేవలు అందించే డాక్టర్లకు..సిబ్బందికి వసతులుకూడా ఇక్కడే ఉంటాయని తెలిపారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కరోనా సెంటర్ గా మార్చాలని నిర్ణయించింది. ఇక ఇక్కడి ప్రత్యేకతలు ఏంటంటే, ఇక్కడన్నీ కార్డ్ బోర్డ్ బెడ్స్ ఉంటాయి. వీటిని రీసైకిల్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ బోర్డ్ పై వైరస్ 24 గంటల కన్నా నిలిచివుండే అవకాశాలు లేవు కాబట్టి, వీటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇవి బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి, వీటిని సులువుగా ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లవచ్చని వీటిని తయారు చేసిన ధావన్ బాక్స్ షీట్ కంటెయినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విక్రమ్ ధావన్ వెల్లడించారు.
ఛత్తార్ పూర్ లో రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. ఇది దాదాపు 12.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ జరిగే సమావేశాలకు సుమారు 3 లక్షల మందికిపైగా హాజరవుతుంటారు. ఇక్కడి అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చబడి వున్నాయి. దీంతో కొవిడ్ చికిత్సా కేంద్రంగా ఈ సెంటర్ ను సులువుగా మార్చవచ్చని ప్రభుత్వం భావించింది.
లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత, ఈ కేంద్రంలో వలస కార్మికులకు ఆశ్రయం కల్పించారు. ఇక్కడ సామూహికంగా వంటకాలు చేసి, ఎంత మందికైనా వడ్డించే సదుపాయాలున్నాయని రాధా సోమీ సత్సంగ్ బియాస్ కార్యదర్శి వాకాస్ సేథీ వెల్లడించారు. ఇక, ఈ కేంద్రాన్ని సందర్శించిన దక్షిణ ఢిల్లీ జిల్లా కలెక్టర్ బీఎం మిశ్రా, ఇక్కడి ఏర్పాట్లు చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాకేశ్ కుమార్‌తో పాటు వైద్యుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి తనిఖీ చేసింది.
ఒక్కొక్కటీ 500 బెడ్లను కలిగివున్న 20 ఆసుపత్రులు చేసే చికిత్సలను ఇక్కడ నిర్వహించవచ్చని అన్నారు. ఇక్కడ రెండు షిఫ్ట్ లలో 400 మంది డాక్టర్లు పని చేయాల్సి వుంటుందని ఆయన తెలిపారు. అత్యాధునిక ఆసుపత్రుల్లో కల్పించే సౌకర్యాలనన్నింటినీ ఇక్కడ కల్పించే వీలుందని, కంప్యూటర్లను సైతం ఇన్ స్టాల్ చేస్తున్నామని తెలిపారు. మిలిటరీ, పారా మిలిటరీ బలగాలు ఇక్కడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని, సెంటర్ నిర్వహణ, లాజిస్టిక్స్, వైద్య పరికరాలు, శానిటేషన్ వర్కర్లను కేటాయించనున్నామని తెలిపారు. జూన్ 30 నాటికి ఈ సెంటర్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?