దోహా:వర్చువల్ స్పోర్ట్స్ నిర్వహణకు సిద్ధమైన ఖతార్ ఒలంపిక్ కమిటి

- June 17, 2020 , by Maagulf
దోహా:వర్చువల్ స్పోర్ట్స్ నిర్వహణకు సిద్ధమైన ఖతార్ ఒలంపిక్ కమిటి

దోహా:లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న వారి కోసం ఖతార్ ఒలంపిక్ కమిటీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నాలుగు వారాల పాటు వర్చువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించబోతోంది. ఖతార్ ఒలంపిక్ కమిటి కు సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ లో సైక్లింగ్, రన్నింగ్, ఆర్ట్స్, డ్రాయింగ్, యోగా లాంటి ఈవెంట్స్ చేపట్టనుంది. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా ప్రముఖ క్రీడాకారులతో చిన్నారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించనుంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వాళ్లు ఈ క్లాసుల ద్వారా ఫిట్ నెస్ పెంపొందించుకునేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంది కమిటి. ఇంటి వద్ద ఫిట్నెస్ కాపాడుకునేందుకు చేస్తున్న కసరత్తు వీడియోలను, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటిస్ వీడియోలను సంక్షిప్తంగా పంపించాలని కూడా కమిటి సూచించింది. వివిధ కేటగిరిలో 5, 10 కిలోమీటర్ల సైక్లింగ్, రన్నింగ్, డ్రాయింగ్, ఆర్ట్స్, యోగా పోటీలను నిర్వహించి..కాంపిటిషన్ లో గెలుపొందిన వారికి 30,000 డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. గృహనిర్బంధంలో ఉన్న వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా అయ్యేందుకు ఈ వర్చువల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఖతార్ ఒలంపిక్ కమిటి వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com