కోవిడ్ 19: వృద్ధులు, పిల్లలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన దుబాయ్
- June 18, 2020
దుబాయ్:లాక్ డౌన్ సాధారణ జనజీవనం దిశగా ఆంక్షలను సడలిస్తున్న దుబాయ్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలపై ఉన్న లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా నేపథ్యంలో 60 ఏళ్లకుపై బడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు పబ్లిక్ ప్రాంతాల్లో తిరగొద్దని జూన్ 18 నుంచి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..దుబాయ్ సుప్రీం కమిటీ తాజా నిర్ణయంతో ఇక నుంచి వృద్ధులు, పిల్లలు కూడా షాపింగ్ మాల్స్ లోకి వెళ్లవచ్చు. కానీ, ఫేస్ మాస్కులు ధరించి..ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. కనీసం రెండు మీటర్ల వ్యత్యాసం ఉండేలా భౌతిక దూరం అనుసరించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. బుధవారం నాటికి 42,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..293 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







