స్వీటెన్డ్ డ్రింక్స్‌పై 50 శాతం పన్ను
- June 19, 2020
మస్కట్: ఒమన్ ట్యాక్స్ అథారిటీ, అక్టోబర్ నుంచి సుల్తానేట్‌లో స్వీటెన్డ్ బివరేజెస్పై 50 శాతం ట్యాక్స్ విధించనున్నట్లు వెల్లడించింది. షుగర్ లేదా స్వీటెనర్స్ కలిపి తయారు చేసే బెవరేజెస్‌పై 50 శాతం ఎక్సయిజ్ ట్యాక్స్ విధించనున్నామని ట్యాక్స్ అథారిటీ ఛైర్మన్ సుల్తాన్ అల్ హాబ్జి చెప్పారు. క్యాన్డ్ జ్యూస్‌లు, ఫ్రూట్ డ్రింక్స్, కెఫైన్ డ్రింక్‌లు మరియు టీ వంటివి ఈ ట్యాక్స్లోకి వస్తాయి. 100 శాతం నేచురల్ ఫ్రూట్ జ్యూస్‌లు, పాలు, పాల సంబంధిత పదార్థాలు వంటి వాటికి ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపునిస్తారు. ఒమన్ గతంలో ఆల్కహాల్, టొబాకో అలాగే ఎనర్జీ డ్రింక్స్‌పై 100 శాతం ట్యాక్స్ వేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







