దోహా:కార్మికుల వేసవి పని వేళల నిబంధనల ఉల్లంఘన..56 కంపెనీలకు జరిమానా
- June 20, 2020
దోహా:వేసవి కాలానికి సంబంధించి కార్మికుల పనివేళల నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు చేపట్టింది కార్మిక, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ. నిబంధనలు పాటించని 56 కంపెనీలపై జరిమానాలు విధించింది. ఈ వేసవిలో (జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు) పగటి వేళల్లో కార్మికులకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించాల్సిందేనని మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు ఎండతగిలే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో పని చేయనీయకూడదు. పైగా కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. ఈ నిబంధనలు అన్ని కంపెనీ యాజమాన్యాలు ఎంతవరకు పాటిస్తున్నాయో పరిశీలించేందుకు కార్మిక సాంఘిక సంక్షేమ శాఖ ఈ నెల 15 నుంచి 18 వరకు తనిఖీలు చేపట్టింది. ఈ మూడు రోజుల సోదాల్లో ఖతార్ లో వివిధ ప్రాంతాల్లోని 56 కంపెనీలు వేసవి పని వేళల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆ 56 కంపెనీలకు జరిమానా విధించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







