కువైట్ : షామియా, షువైఖ్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్

- June 20, 2020 , by Maagulf
కువైట్ : షామియా, షువైఖ్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్

కువైట్ లో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైరస్ వ్యాప్తిని మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో నియంత్రించక లేకపోతున్నారు. లేటెస్ట్ సహాకార సంఘాలకు కూడా కరోనా వ్యాపించింది. షామియా కోఆపరేటివ్ సొసైటిలో ఒకరికి, షువైఖ్ కోఆపరేటివ్ సొసైటిలో మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ప్రకటించిన కోఆపరేటివ్ సొసైటి అధికారులు ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు తదుపరి చర్యలు చేపట్టామని వివరించారు. కరోనా కేసులు నమోదైన కోఆపరేటివ్ బ్రాంచ్ లను మూసివేసి క్రిమినాశన చర్యలు(శానిటైజేషన్) చేపట్టినట్లు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com