దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం
- June 26, 2020
భారత దేశ సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఉద్యోగులకు భారీగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచింది.
ఇంజనీర్లు, కార్మికులు వంటి పలు శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కనీస వేతనాన్ని 170 శాతానికి పెంచింది. రిస్క్ అలవెన్స్ ను 100 నుంచి 170 శాతానికి పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ వేతనాలు జూన్ 1,2020 నుంచి అమల్లోకి రానున్నాయి.
జాతీయ హైవేలు..మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తించనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష