వందేభారత్ మిషన్ : ఒమన్ లోని భారతీయులను తరలించేందుకు మరో 16 విమాన సర్వీసులు
- June 26, 2020
ఒమన్:ప్రపంచదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు విమాన సర్వీసుల షెడ్యూల్ ను ప్రకటిస్తూ వస్తోంది కేంద్రం. లేటెస్ట్ ఒమన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు మరో 16 విమాన సర్వీసులను నడపున్నట్లు భారత్ ప్రకటించింది. నాలుగో దశ వందేభారత్ మిషన్ లో భాగంగా జులై 1 నుంచి 16 విమానాలు ఒమన్ నుంచి భారత్ కు నడపనున్నట్లు వివరించారు. ఈ 16 విమానసర్వీసులలో 12 విమానాలు కేరళాకు నడపనున్నారు. మిగిలిన నాలుగు విమానాలను హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైకి నడపనున్నారు. అయితే..ఈ విమానాల్లో టికెట్ల బుకింగ్ గతంలో అనుసరించిన విధానాలనే అనుసరించనున్నారు. గర్భిణులు, మెడికల్ ఎమర్జెన్సీ, సీనియర్ సిటిజన్స్, ఉపాధి కొల్పోయి ఒత్తిడిలో ఉన్న కార్మికులకు తొలి ప్రధాన్యత ఇవ్వనున్నారు. టికెట్లు బుక్ అయిన వారికి ఈ మెయిల్ ద్వారాగానీ, ఫోన్ ద్వారాగానీ సమాచారం అందిస్తారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష