బీహార్, యూపీ రాష్ట్రాల్లో పిడుగుల వర్షం, 107 మంది మృతి

- June 26, 2020 , by Maagulf
బీహార్, యూపీ రాష్ట్రాల్లో పిడుగుల వర్షం, 107 మంది మృతి

ఓ వైపు కరోనా భారతదేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ నష్టం వాటిల్లితున్నాయి. బీహార్, యూపీ రాష్ట్రాల్లో భారీ వర్షానికి తోడు భారీగా పిడుగులు పడ్డాయి. దీని కారణంగా 107 మంది చనిపోయారు. బీహార్ లో 83 మంది, యూపీలో 24 మంది మరణించారు. ఉరుములు, మెరుపులతో 2020, జూన్ 25వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. భారీగా పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బీహార్ లోని 23 జిల్లాల్లో దీని ప్రభావం కనిపించింది. గోపాల్ గంజ్ లో పిడుగుల ధాటికి అత్యధికంగా 13 మంది చనిపోయారు. నవాడాలో 8 మంది చనిపోయారు. శివన్ మరియు బాగల్ పూర్ లో ఆరుగురు మరణించారు. అసమ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, దర్భాంగా మరియు బంకాలో ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయి సహా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాట్లకు బలయ్యారు. పిడుగులు పడి 107 మంది చనిపోవడంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మరణించిన కుటుంబాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నామన్నారు. పిడుగుపాటుకు గురై చనిపోయిన వారి కుటుంబాలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ తన సంతాపం తెలియచేశారు. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పొలాల్లో పని చేస్తున్న సమయంలో పిడుగులు పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. మరణించిన కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com