కువైట్ : ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో కొనసాగనున్న లాక్ డౌన్
- June 26, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో నిర్బంధ ఆంక్షల నుంచి సాధారణ జనజీవనం దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది కువైట్ ప్రభుత్వం. రెండో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో నిషేధ ఆంక్షలను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించారు. వచ్చే మంగళవారం నుంచి రెండో దశ అన్ లాక్ ప్రక్రియ అమలులోకి రానుంది. వాణిజ్య కేంద్రాలు కూడా ప్రారంభించొచ్చని, అయితే..మొత్తం సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్వహించుకోవచ్చని కూడా కువైట్ మంత్రి మండలి వెల్లడించింది. అయితే..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఫర్వానియా, జ్లీబ్ మహబౌలలో మాత్రం నిర్బంధ ఆంక్షలు కొనసాగనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎప్పుడు ఎత్తివేయాలనేది ఆరోగ్య శాఖ అధికారులు తగిన సమయంలో ప్రకటిస్తారని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష