దుబాయ్ - పంజాబ్ కు గురు నానక్ గురుద్వారా వారి ఆధ్వర్యంలో తొలి రిపాట్రియేషన్ చార్టర్ ఫ్లైట్

- June 26, 2020 , by Maagulf
దుబాయ్ - పంజాబ్ కు గురు నానక్ గురుద్వారా వారి ఆధ్వర్యంలో తొలి రిపాట్రియేషన్ చార్టర్ ఫ్లైట్

దుబాయ్ : అనుకున్న షెడ్యూల్ ప్రకారమే దుబాయ్ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కు ఛార్టర్డ్ ఫ్లైట్ బయల్దేరింది. లాక్ డౌన్ తో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా తొలి విమానం దాదాపు 209 మంది భారత ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయల్దేరారు. దుబాయ్ లోని గరుద్వారా గురునానక్ దర్బార్ వారు ఈ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో అమృత్ సర్ కు మరిన్ని ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నారు. తొలి విమానం గురువారం టేకాఫ్ కాగా..రెండో విమానం ఈ నెల 27న బయల్దేరుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మొత్తం 6 ప్రత్యేక విమానాలను పంజాబ్ నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు తోడ్పాటు అందించిన దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులకు గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ ఖాందారి కృతజ్ఞలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com